వరవరరావుకు బెయిల్ మంజూరు చేసి..మెరుగైన వైద్యం అందించాలి

వరవరరావుకు బెయిల్ మంజూరు చేసి..మెరుగైన వైద్యం అందించాలి

కరోనా బారిన పడ్డ విరసం నేత వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ నిరసనకు దిగారు. వరవరరావు ప్రాణాలకు హాని జరిగితే కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వరవరరావు ను బేషరతుగా విడుదల చేయాలన్నారు కొమ్మిడి నర్సింహా రెడ్డి.

బీమా కోరేగావ్  కేసులో అరెస్టై 22 నెలలుగా ముంబైలోని తలైజా జైలులో ఉంటున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.