హైదరాబాద్, వెలుగు: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ పథకం ‘బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్’ను ప్రారంభించింది. ఈ రంగంలోని 180–-200 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 45-–60 స్టాక్స్‌లో ఈ ఫండ్ పెట్టుబడి పెడుతుంది.
నవంబర్ 10 నుంచి నవంబర్ 24 వరకు న్యూ ఫండ్ ఆఫర్ ఉంటుంది. డిజిటలైజేషన్, పెరుగుతున్న క్రెడిట్ వినియోగం లాంటి అంశాల కారణంగా ఈ రంగం వేగంగా పెరుగుతోంది. అధిక రిస్క్ సామర్థ్యం ఉన్న దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
