సోమేశ్ కుమార్ పై సీబీఐతో విచారణ జరిపించాలె : బక్క జడ్సన్

 సోమేశ్ కుమార్ పై సీబీఐతో విచారణ జరిపించాలె : బక్క జడ్సన్

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన ఆయన... రాష్ట్రం రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 4 లక్షల కోట్లకు ఇన్స్టాల్మెంట్లు  కట్టడానికి రూ.13వేల కోట్లు అవుతాయన్నారు.   2014 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఏవిధంగా పెరిగాయో వివరాలను కూడా అందజేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత సంపాదించలేదని జడ్సన్ ఆరోపించారు. 

రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాలకు అర్థం లేకుండా పోయిందని జడ్సన్ తన ఫిర్యాదులో వాపోయారు. రాష్ట్రం మొత్తం పెత్తందారి వ్యవస్థగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు లోపించాయని ఆరోపించిన ఆయన.. ఆర్టికల్356  ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతిని కోరారు. ధరణి పోర్టుల్ కు కారకుడైన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జడ్సన్ ఆరోపణలు చేశారు.