
బలగం (BalagamMovie) సినిమాకు అంతర్జాతీయ అవార్డులు క్యూ కట్టాయి. మొన్న లాస్ ఏంజెల్స్.. నిన్న ఉక్రెయిన్ ఫిల్మ్ అవార్డ్సు రాగా.. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ (America) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకోవటం విశేషం. ఏప్రిల్ 3వ తేదీ ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
అమెరికా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల కింద బలగం సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ కింద వేణుకు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరీ కింద హీరో ప్రియదర్శికి.. బెస్ట్ యాక్టరస్ ఇన్ ఏ ఫూచర్ కేటగిరీ కింద హీరోయిన్ కావ్య కల్యాణ్ రాంకు, బెస్ట్ నేరేటివ్ ప్యూచర్ కింద డైరెక్టర్ వేణుకు ఈ అవార్డ్స్ వచ్చాయి.
మొన్నటికి మొన్న లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది బలగం సినిమా. రెండో అంతర్జాతీయ అవార్డ్ రావటంపై సినిమా యూనిట్ బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యం అయ్యిందని ట్విట్ చేసింది యూనిట్.
ఈ విషయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో అంతర్జాతీయ అవార్డ్సులు రావటంతో చిత్ర యూనిట్ బృందం ఆనందానికి అవధులు లేవు. బలగం గోస్ గ్లోబల్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది బలగం సినిమా.