యాదగిరిగుట్టలో బాలయ్య అఖండ టీం

యాదగిరిగుట్టలో బాలయ్య అఖండ టీం

నందమూరి నటసింహం బాలకృష్ణ యాదగిరిగుట్టలో పర్యటించారు. యాదాద్రి ఆలయంలోని లక్ష్మీనరసింహ స్వామి సేవలో పాల్గొన్నారు. తాజాగా బాలయ్య సినిమా అఖండ విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా అఖండ టీంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య వెంట దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను ‘అఖండ’ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం. నాలుగో వారంలో కూడా ‘అఖండ’ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా అఖండ టీం ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ హిట్స్‌ను సాధించారు.

 

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ.. నేతల అరెస్టు

భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి