OTTకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

OTTకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బాలయ్య, శ్రీలీల(Sreeleela) మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. బనావో బేటీకో షేర్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ సినిమా.

దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను నవంబర్ 23 నుండి స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తన తరువాతి సినిమాను దర్శకుడు బాబీతో చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న ఈ మూవీ రెగ్యులర్  షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సందర్బంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటికే వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య.. NBK109 తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ALSO READ: నేను డాలర్ని.. ఎక్కడైనా చెల్లుతా.. పువ్వాడ రద్దు చేసిన 2 వేల నోటు : తుమ్మల

  •  
  • Beta
Beta feature