బేగంబజార్‌ పటేల్‌ నగర్‌ లో పటాకులు తెచ్చిన లొల్లి కత్తులతో దాడి..ముగ్గురికి గాయాలు

బేగంబజార్‌ పటేల్‌ నగర్‌ లో పటాకులు తెచ్చిన లొల్లి  కత్తులతో దాడి..ముగ్గురికి గాయాలు
  •     బేగంబజార్‌ పటేల్‌నగర్‌లో ఘటన  

బేగంబజార్, వెలుగు : దీపావళి వేళ పటాకుల విషయంలో తలెత్తిన వివాదం కత్తులతో దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. గాంధీభవన్‌ సమీపంలోని పటేల్‌నగర్‌కు చెందిన వాహీద్ అల్లుడు సమీర్‌ (14)పై కొందరు పటాకులు కాల్చి మీద వేయడంతో వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు. దీంతో సల్మాన్‌, గౌస్‌, మున్నూ రెహ్మాన్‌తో పాటు వారి స్నేహితులకు... వాహీద్ వర్గానికి చెందిన ఇమ్రాన్‌, షైబాజ్‌లకు తీవ్ర వాగ్వాదం జరిగి కత్తులతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. 

ఈ ఘటనలో  వాహీద్, ఇమ్రాన్‌, షైబాజ్‌లకు గాయాలయ్యాయి. ఘటనలో మొదట ఎవరు ఎవరిపై దాడికి దిగారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. సల్మాన్‌, గౌస్‌, మున్నూ రెహ్మాన్‌ పరారీలో ఉన్నారు.