
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తవగా, ఇటీవల మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈనెల 21 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. రాజస్థాన్‌లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. దీంతో టీమ్ అంతా రాజస్థాన్ వెళ్తున్నారు. సినిమాకు ఎంతో కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా.. ‘వీర మాస్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఓల్డ్ స్టైల్‌లో ఈ టైటిల్ ఉందంటూ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ చిత్రం. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. ఊర్వశీ రౌతేలా, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.