
నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
లేటెస్ట్ గా దసరా సందర్భంగా బాలకృష్ణను శ్రీలీల స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోకు ‘కేసరి చిచ్చా & విజ్జి పాప’ పేరుతో ఈ ఇంటర్వ్యూ మొదలైంది. ఈ షోలో బాలకృష్ణని కొన్ని ఆసక్తికర విషయాలను శ్రీలీల అడిగింది.
శ్రీలీల ప్రశ్న వేస్తూ..ఇంతకీ మీ అబ్బాయి మోక్షజ్ఞ (Mokshagna) డెబ్యూ ఎప్పుడు ఉంటుంది? అడగగా..దానికి బాలయ్య మరోసారి సూటైనా సమాధానం ఇచ్చారు.
మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో ఉంటుందని..అది గ్రేట్ రామారావు మనవడిగానో లేక బాలకృష్ణ కొడుకు గానో ఉండదు. నందమూరి లెగసీని అంత మోక్షజ్ఞ ముందుకు తీసుకెళ్లాలి. ఇది అతి త్వరలో జరగబోతుంది అంటూ..బాలకృష్ణ ఖరాకండిగా చెప్పారు. అలాగే నాకెప్పుడూ మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి దిగులే లేదని, అంతేకాని మోక్షజ్ఞ డెబ్యూ కోసం కంగారుగా ఏదీ ప్లాన్ చేయనని బాలకృష్ణ తెలిపారు.
Also Read : పార్టీ మద్దతుపై తీవ్ర అసంతృప్తి.. బీజేపీకి నటి గౌతమి రాజీనామా
ఇదిలా ఉంటే ..మోక్షజ్ఞతో తాను ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా మాత్రం పక్కా తెరకెక్కిస్తానని..స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయినట్లు పేర్కొన్నారు. కాకపోతే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఏదవుతుందో కన్ఫర్మ్ గా చెప్పలేనని పేర్కొన్నారు.
భగవంత్ కేసరి సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.71.02కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో..ఈ వీకెండ్ బాక్సాపీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు.