ఒక్కొక్కరి భరతం పడతా.. బాలయ్య సీరియస్ వార్నింగ్

ఒక్కొక్కరి భరతం పడతా.. బాలయ్య సీరియస్ వార్నింగ్

చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై స్పందించారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ. నోటితో కాదు ఓటుతో జవాబు చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అన్ని చాలా బాధకరమన్నారు. అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి కోసం జరగాలన్నారు. కానీ అలా కాకుండా సభ దృష్టి మరల్చి.. వ్యక్తిగత విషయాలకు వెళ్లడం సరికాదన్నారు.చంద్రబాబు ఎప్పుడూ కంటతడి పెట్టుకోలేదన్నారు. బాబు గారు ఎప్పుడూ ధైర్యంగా ఉండే మనిషి అన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి సమస్యలపైనే పోరాడుతున్నామన్నారు. మా చెల్లెలు భువనేశ్వరిపై మాట్లాడటం సరికాదన్నారు. 

మనం గొడ్ల చావిడిలో ఉన్నామా ?  అసెంబ్లీలో ఉన్నామా ? ఇంటి ఆడవారిపై మాట్లాడటం ఏంటి? ఆమె గౌరవ ప్రదమైన కార్యక్రమాల్లో ఉంది. వారి ఇంట్లో ఆడవారితో కూడా ఒకసారి మాట్లాడమని చెప్పండని బాలయ్య ఫైర్ అయ్యారు. మేం చేతులు కట్టుకొని కూర్చోలేదన్నారు. వాళ్లింట్లో కూడా సమస్యలు ఉంటాయన్నారు. ఆ విషయాలు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారన్నారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేసి వేరేవారిపై నోరు పారేసుకోవడం ఏంటని బాలయ్య సీరియస్ అయ్యారు. ఇంత నీఛానికి దిగజారడం ఏంటని బాలయ్య ప్రశ్నించారు.

సభ హుందాగా నడవాలన్నారు. స్పీకర్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. సభను ఏకపక్షంగా, ప్రభుత్వ పక్షంగా నడిపిస్తున్నార్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్పీకర్ ఇలానే వ్యవహరించారన్నారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారన్నారు. ఇంటి ఆడవాళ్లపైకి వచ్చి మాట్లాడటం సరికాదన్నారు. మనకు రాజకీయ చైతన్యం ఇచ్చారు దివంగత సీఎం రామారావు గారు అన్నారు బాలయ్య. మంచి సలహా ఇస్తే తీసుకోరాన్నారు. ఏది చెప్పినా ద్వందర్థం తీస్తున్నారన్నారు. మీరు మారరు.. మారకపోతే మెడలు వంచి మారుస్తామన్నారు. కుటుంబ సభ్యులే కాదు.. నా అభిమానులు... కార్యకర్తలు .. ప్రజలు మిమ్మల్ని మారుస్తారన్నారు. 

మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారా? ఏది శాశ్వతం కాదు. పదవులు కూడా శాశ్వతం కాదన్నారు. ఇవాళ అధికారంలో మీరు ఉన్నారు ? రేపు మేం ఉండొచ్చు అంటూ బాలయ్య మాట్లాడారు. 
మీ పాలన ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు హయాంలో ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చూసుకున్నారన్నారు. ఆయన ముందు చూపు ఉన్న నాయకుడు అన్నారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడండి అన్నారు బాలయ్య.లేకుంటే చంద్రబాబు చెప్పినా వినమన్నారు.  ఇది నా హెచ్చరిక అన్నారు బాలయ్య. మళ్లీ ఇలాంటి నీఛ నికృష్ణ, పాపిష్ట పదాలు మాట్లాడితే.. ఒక్కొక్కరి భరతం పడతాం.. ఖబడ్దార్ అంటూ బాలయ్య గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

నేను చంద్రబాబు వియ్యంకుడిలాగానో, రామారావు గారి కొడుకులా కూడా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఈసారి ఎన్ని అడ్డం పెట్టుకున్నా వాటిని బద్దలు కొట్టుకొని మిమ్మల్ని ఎదురిస్తానన్నారు. భువనేశ్వరి ఓ వ్యాపారం చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటుందన్నారు. మీ పాలనలో మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. మీ వ్యవహారం భాష చూస్తే.. గొడ్ల చావిడిలోకి వచ్చినట్లు ఉందన్నారు. నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలన్నారు.