ప్రశాంతంగా బాలాపూర్ గణేష్ నిమజ్జనం

ప్రశాంతంగా బాలాపూర్ గణేష్ నిమజ్జనం

బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భారీ శోభాయత్రతో వచ్చిన గణపయ్యను..క్రేన్ నెంబర్ 9 వద్ద నిమజ్జనం చేశారు. జోరు వానలోనూ వినాయకుడిని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకుముందే ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు.

24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ 

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికింది. రూ. 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.9 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా... ఈ సారి అంతకు మించి రూ.24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకున్నారు.

గతేడాది కంటే రూ.5లక్షల 70 వేలు ఎక్కువ పలికిన బాలాపూర్ లడ్డూ

ఏడాదికేడాది పెరుగుతూ వస్తోన్న బాలాపూర్ లడ్డూ వేలం... ఈ సారి రికార్డ్ స్థాయిలో పెరిగింది. గతేడాది మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కలిసి రూ.18 లక్షల 90 వేలకు కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది వేలం పాటలో బాలాపూర్ గ్రామస్థుడు వంగేటి లక్ష్మారెడ్డి  రూ.24 లక్షల 60 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో గతేడాదితో పోల్చితే లడ్డూ వేలం ఈ సారి రూ.5 లక్షల 70 వేలకు పెరిగింది.