శోభాయాత్ర : బాలాపూర్‌‌‌‌ ‌‌‌‌టు హుస్సేన్‌‌‌‌ సాగర్ .. నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు

శోభాయాత్ర :  బాలాపూర్‌‌‌‌ ‌‌‌‌టు హుస్సేన్‌‌‌‌ సాగర్ ..  నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు

హైదరాబాద్,వెలుగు :  సిటీలో గణనాథుల శోభాయాత్ర,  ​నిమజ్జనానికి పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ వరకు కొనసాగనుండగా.. మెయిన్ రూట్​తో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలైన పీవీఎన్‌‌‌‌ఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌ నుంచి పీవీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌, ఐమాక్స్‌‌‌‌ వైపు శుక్రవారం సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. శోభా యాత్రకు సంబంధించిన ట్రాఫిక్‌‌‌‌  డైవర్షన్స్‌‌‌‌ రూట్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను సిటీ సీపీ ఆనంద్‌‌‌‌ బుధవారం విడుదల చేశారు. ప్రధాన శోభాయాత్రలో ఊరేగింపులకు అనుగుణంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చేస్తారు. గణేశ్​ విగ్రహాలను తీసుకెళ్లే వెహికల్స్​ను మినహా ఇతర వెహికల్స్​ను అనుమతించరు. 

బాలాపూర్​ దాటిన తర్వాత.. 
‌‌‌‌
బాలాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి షురూ అయ్యే శోభాయాత్ర  మొత్తం 21 కిలోమీటర్లు సాగనుంది. బాలాపూర్ దాటిన తర్వాత చంద్రాయణ గుట్ట పీఎస్‌‌‌‌ పరిధిలోని కట్టమైసమ్మ టెంపుల్‌‌‌‌ వద్ద సిటీ కమిషనరేట్‌‌‌‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఫలక్‌‌‌‌నుమా, అలియాబాద్‌‌‌‌, చార్మినార్‌‌‌‌‌‌‌‌, మదీనా, అఫ్జల్‌‌‌‌గంజ్‌‌‌‌, ఎంజే మార్కెట్‌‌‌‌, అబిడ్స్ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌, పీవీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌కు చేరుకోనుంది. అదేవిధంగా సికింద్రాబాద్‌‌‌‌, ఉప్పల్‌‌‌‌, మెహిదీపట్నం, సంతోష్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, గోషామహల్‌‌‌‌, అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌ తోపాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి కూడా శోభాయాత్రగా వచ్చి ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌మినీ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా 040-27852482/8712660600, హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ 9010203626 కాల్‌‌‌‌ చేయాలని పోలీసులు సూచించారు.

ఉదయం 6 గంటలకు బడా గణేశ్​శోభాయాత్ర

గురువారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయత్ర ప్రారంభమవుతుందని భాగ్యనగర ఉత్సవ సమితి వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయనున్నట్లు వెల్లడించింది. నిమజ్జనం నేపథ్యంలో బుధవారం భక్తులు భారీగా తరలివచ్చి బడా గణేశ్​ను దర్శించుకున్నారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు. బుధవారం అర్ధరాత్రి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.