ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అటవీశాఖ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్ఆర్వో)గా బాలరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఖమ్మం ఇన్చార్జి ఎఫ్ఆర్వోగా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలను బాలరాజుకు అప్పగించారు. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
