బల్దియా ఏఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి

బల్దియా ఏఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి
  • కమిషనర్​కు సివిల్​ కాంట్రాక్టర్ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు :  చార్మినార్ జోన్ ట్రాన్స్ పోర్టు విభాగంతో పాటు ఫలక్​నుమా సర్కిల్   అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశాంత్  వాహనాల టైర్లను మాయం చేశారంటూ బల్దియా సివిల్ కాంట్రాక్టర్ సాయి కిరణ్ కమిషనర్​తో పాటు చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్​కు ఫిర్యాదు చేశాడు. జీహెచ్ఎంసీ ఇచ్చిన కారుతో పాటు తన పర్సనల్ కారుతో ఆయన బంధువుల వాహనాలకు టైర్లు బిగించుకున్నారని ఆరోపించారు.  బల్దియా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఇటీవల ఓ విద్యాసంస్థకు చెందిన 
బస్సు​కు కూడా టైర్లను వేయించినట్లు ఆరోపించారు.

అవసరం లేకపోయినా బంధువుల టైర్ల షాపుల్లో కొనుగోలు చేశారని, దీంతో బల్దియా నిధులను పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.