ఎంత అహంకారం : సీఎం రేవంత్ రెడ్డిపై.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన బాల్క సుమన్

ఎంత అహంకారం : సీఎం రేవంత్ రెడ్డిపై.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన బాల్క సుమన్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ దుర్భాషలాడారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద లంగగాడు, హౌలే గాడని దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు.  సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి బాల్క సుమన్ మాట్లాడాలన్నారు.  

 

రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని బాల్క తెలిపారు. రైతు బంధు కోసం గ‌త ప్రభుత్వం విడుద‌ల చేసిన రూ.7 వేల700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘ‌వ కంపెనీకి, కాంగ్రెస్ కంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళించారని బాల్క సుమన్ ఆరోపించారు.