చెన్నూరులో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్దం..

చెన్నూరులో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్దం..

   బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా  చెన్నూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. అనంతరం బాల్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

సోమవారం మంచిర్యాలలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి  అంటూ రేవంత్ రెడ్డిని చెప్పుతో  కొడతా అంటూ వేదికపై చెప్పు ఎత్తి చూపారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు దిష్టి బొమ్మ నిరసన తెలిపారు.