వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

పంజాగుట్ట, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ రథోత్సం బుధవారం సాయంత్రం వైభవంగా సాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సనత్ నగర్ కాంగ్రెస్​ఇన్​చార్జ్ కోట నీలిమ, కలెక్టర్​అనుదీప్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు.

వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలు సజావుగా సాగాయని, కాంగ్రెస్​కార్యకర్తలు, వలంటీర్లు మంచిగా పనిచేశారని కోట నీలిమ తెలిపారు.