కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణమహోత్సవం

కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణమహోత్సవం


బల్కంపేట ఎల్లమ్మ కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరానక్షత్ర యుక్త కన్యాలగ్న సుముహుర్తాన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మాంగళ్యధారణ నిర్వహించారు. దేవస్థానం ముందు ఉన్న రాజమార్గంలో ఏర్పాటు చేసిన కల్యాణమండపంలో కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మంత్రి తలసాని అమ్మవారి కల్యాణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. నిన్న ఉదయం ఎల్లమ్మ అమ్మవారిని పెళ్లికుమార్తెను చేశారు. రాత్రి 7 గంటలకు గణపతి పూజలు.. తర్వాత ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది.

వేద పండితుల గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎస్ఆర్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లను ప్రారంభించి..ఒగ్గు కళాకారులతో గంగతెప్ప,పుట్ట బంగారాన్ని శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువచ్చారు.ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు