
బాల్కొండ, వెలుగు : బాల్కొండ మోడల్ స్కూల్ లో బోటనీ వృక్షశాస్త్రం టీచర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ గురువారం తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.