IPL2019: బెయిల్స్‌ పడకపోవడంపై రహానె అసహనం

IPL2019: బెయిల్స్‌ పడకపోవడంపై రహానె అసహనం

ఐపీఎల్‌ 12వ సీజన్‌ లో ఆటకంటే వేరే విషయాలపైనే ఎక్కు వ చర్చ జరుగుతోంది. ఆరంభంలో మన్కడింగ్‌ , ఆ తర్వాత అంపైరింగ్‌ తప్పిదాలు.. తాజాగా బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌‌‌‌‌‌‌‌ పడకపోవడంతో రచ్చ నడుస్తోంది.ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌ మధ్య మ్యాచ్‌ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌ గా మారింది. రాయల్స్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ కులకర్ణి వేసిన బంతి కోల్‌ కతా ఓపెనర్‌‌‌‌‌‌‌‌ క్రిస్‌ లిన్‌ బ్యాట్‌ ఇన్‌ సైడ్‌ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకొని వికెట్లపైకి దూసుకెళ్లింది. వికెట్లకున్న లైట్లు కూడా వెలిగాయి. దీంతో ఔటనుకున్న లిన్ క్రీజు వదిలి పెవిలియన్‌ వైపు నడక ప్రారంభించాడు. కాసేపాగి గమనిస్తే బెయిల్స్‌‌‌‌‌‌‌‌  కింద పడలేదు. దీంతో అప్పటికి 13 రన్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఈ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ తిరిగి బ్యాటింగ్‌ కొనసాగించి అదిరిపోయే హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్లను తాకి దిశ మార్చుకున్న ఆ బంతి తర్వాత బౌండ్రీ దాటడం విశేషం.

‘వికెట్లను తాకిన తర్వాత వచ్చిన బౌండ్రీని పరిగణించొద్దని అంపైర్‌‌‌‌‌‌‌‌ని కోరినా లాభంలేక పోయింది. టీ20ల్లో బౌలింగ్‌ చేయడం అంటేనే చాలా కష్టం . అలాంటిది వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎలా. కనీసం ఆబంతిని డెడ్‌ బాల్‌ గా నైనా ప్రకటించాల్సింది’ అనిరహానె అసహనం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌ లోఇలా జరగడం ఇది మూడోసారి. రాజస్థాన్‌ ను దురదృష్టం వెంటాడటం ఇది తొలిసారేం కాదు. ఇంతకుముందు చెన్నై తో మ్యాచ్‌ లో ధోనీ కూడా ఇలాగే బతికిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే మహీ ఔట్‌ కావాల్సింది.. జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌ బంతిని డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు యత్నించగా.. బంతి బ్యాట్‌ ను ముద్దాడి నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది కానీ బెయిల్స్‌‌‌‌‌‌‌‌ పడలేదు. దీంతో ఊపిరిపీల్చుకున్న మహీమ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో టీమ్‌ను గెలిపించాడు. పంజాబ్‌, చెన్నై మధ్య మ్యాచ్‌ లోనూ ఈ సీన్‌ రిపీట్‌అయింది. బంతిని లెగ్‌ సైడ్‌ ఆడి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించిన లోకేశ్‌ రాహుల్‌ క్రీజు వదిలి చాలా బయటకు వచ్చాడు. అది గమనించిన ధోనీ వికెట్లకు గురి చూసి కొట్టాడు. ఆ సమయానికి బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌ క్రీజులోకి రాకున్నా.. బెయిల్స్ పడకపోవడంతో అంపైర్‌‌‌‌‌‌‌‌ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ దీనిపై స్పందిస్తూ.. ‘రూల్స్‌‌‌‌‌‌‌‌ మార్చాల్సిన అవసరం ఉంది. బంతి వికెట్‌లకు తాకి లైట్ వెలిగితే బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌ ను ఔట్‌ గా ప్రకటించాలి’అని అన్నాడు.