తెలంగాణ ఎలక్షన్స్ : బ్యాలెట్ పేపర్ల కోసం కొత్త ప్రింటింగ్ మెషీన్లు

తెలంగాణ ఎలక్షన్స్ : బ్యాలెట్ పేపర్ల కోసం కొత్త ప్రింటింగ్ మెషీన్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పనులను స్పీడప్ చేసింది ఎలక్షన్ కమిషనర్. ఈ మేరకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయటానికి కొత్త ప్రింటింగ్ మెషీన్లు సిద్ధం అయినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఈవో సత్యవాణి. నవంబర్ 17వ తేదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారామె. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉండటంతో.. ముందుగానే ప్రింటింగ్ మొదలుపెట్టినట్లు వివరించారామె. 

గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 299 కొత్త పోలింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చామని.. ఓటర్ల సంఖ్య పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారామె. కౌంటింగ్ సెంటర్ల అనుమతి కోసం ప్రపోజల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించినట్లు స్పష్టం చేశారు సీఈవో సత్యవాణి. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రపరచటానికి స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.. అన్నీ వ్యవహారాలు చకచకా జరుగుతున్నట్లు వివరించారామె. ఏ, బీ, సీ, డీ పద్దతిలో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో 28 వేల మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని.. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారామె. రిటర్నింగ్ అధికారులపైనా కంప్లయింట్స్ వచ్చాయని.. అయితే వాటిపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదని వివరించారు సీఈవో సత్యవాణి.