రష్యన్​ బ్యాంకులపై అమెరికా బ్యాన్​

రష్యన్​ బ్యాంకులపై అమెరికా బ్యాన్​

యూఎస్​లోని రష్యన్లకు చెందిన 3 ట్రిలియన్ల ఆస్తులు సీజ్​: బైడెన్​
వాషింగ్టన్: ఉక్రెయిన్​పై రష్యా అన్యాయంగా దాడులు చేస్తోందని, సామాన్య ప్రజలను చంపేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఆందోళ న వ్యక్తంచేశారు. గురువారం అర్ధ రాత్రి బైడెన్ మాట్లాడారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించారు. ఆ దేశా నికి చెందిన 4 బ్యాంకుల ఆస్తులను బ్లాక్​ చేస్తామని ప్రకటించారు. దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. రష్యాదాడులను తీవ్రంగా ఖండిస్తు న్నామని, ఉక్రెయిన్​లో పరిణామాల కు రష్యానే పూర్తి బాధ్యత వహించా లని అన్నారు. యూఎస్​తోపాటు మిత్ర దేశాలన్నీ సరైన సమయంలో స్పందిస్తాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్​ ప్రజలకు అండగా ఉంటాయన్నారు.