
జుట్టు చివర్లు చిట్లడం తగ్గాలంటే... అరటిపండు ప్యాక్ వేసుకోవాలి. అరటిపండు మాస్క్ తయారీ కోసం.. బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల పాలు, కొంచెం తేనె వేసి కలపాలి. ఈ ప్యాక్‌ని తలకి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే ఫలితం కనిపిస్తుంది.
- కొబ్బరినూనెని వేడి చేసి తలకి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు మొత్తానికి పొడి టవల్ చుట్టాలి. కొంచెం సేపటి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలాచేస్తే వెంట్రుకలు పెరగడానికి అవసరమైన పోషకాలు, తేమ అందడమే కాకుండా వెంట్రుకలు చిట్లవు.
- జుట్టు బలంగా ఉండడానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు గుడ్డులో ఉంటాయి. అందుకని గుడ్డుతో మాస్క్ తయారుచేసుకొని వేసుకోవచ్చు. ఈ మాస్క్ తయారీ కోసం... గుడ్డు తెల్ల సొన, ఒక స్పూన్ పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. ముప్పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో వెంట్రుకల్ని శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి ఎగ్ మాస్క్ వేసు కుంటే వెంట్రుకల కొసలు చిట్లిపోవడం తగ్గుతుంది.