ప్రలోభ పెడుతున్నాడంటూ TRS నాయకుడిని అడ్డుకున్న ఓటర్లు

ప్రలోభ పెడుతున్నాడంటూ TRS నాయకుడిని అడ్డుకున్న ఓటర్లు

పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటున్నారు స్థానికులు. ఇదే కారణంతో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వియ్యంకుడు రాంరెడ్డిని అడ్డుకున్నారు ప్రజలు. 19వ వార్డులోని బండారికుంటకు వచ్చిన రాంరెడ్డిని ఘెరావ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి రాంరెడ్డి వచ్చారంటూ ఆరోపించారు. దాంతో పోలీసులు వచ్చి రాంరెడ్డిని అక్కడి నుంచి పంపించి వేశారు. స్థానికులు మాత్రం పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.