వాహనాల వినియోగం ఎక్కువైపోతున్నప్పటికీ వాటి నుంచి వచ్చే పొగతో కాలుష్యమేర్పడుతోంది. కరీంనగర్ పట్టణంలో కొందరు కాలం చెల్లిన వాహనాలను అలాగే నడిపిస్తుండడంతో వెనుక నుంచి పొగలు కక్కుతున్నాయి.
వీటికి తోడు ఇంజిన్‌లో సమస్య ఉన్న(బోర్‌కు వచ్చిన) వాహనాలను అలాగే నడిపిస్తుండడంతో వెనుకాల వచ్చే వాహనదారులతోపాటు రోడ్ల పక్కన నడిచేవారు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలో ఇలా పొగ చిమ్ముతూ వెళ్తున్న వాహనాలు కన్పించాయి. -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
