బాలరాజ్ లేకపోతే బాన్సువాడలో కాంగ్రెస్ లేదు

బాలరాజ్ లేకపోతే బాన్సువాడలో కాంగ్రెస్ లేదు

కోటగిరి,వెలుగు : కాసుల బాలరాజు లేకపోతే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టే లేదని ఉమ్మడి కోటగిరి మండల నాయకులు స్పష్టం చేశారు. మున్నిపల్ ఎన్నికల్లో బాన్సువాడలో రుద్రూర్ మాజీ సర్పంచ్, వర్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ తీరును ఖండిస్తూ కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లో గురువారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఏకంగా అగ్రోస్ చైర్మన్ కుటుంబీకులనే ఓడించాలనే దురుద్దేశంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులతో చేతులు కలిపి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ని మోసం చేయటం సిగ్గు చేటన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంతు, మాజీ ఎంపీపీ గంధపు పవన్, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, మాజీ ఎంపీటీసీలు కొట్టం మనోహర్, కేశ వీరేశం, అనంత విఠల్,మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. 

రుద్రూర్​లో.. ​

వర్ని :  మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్​కు వ్యతిరేకంగా చంద్రశేఖర్ పని చేయడం సరికాదని కాంగ్రెస్​రుద్రూర్​ మండల అధ్యక్షుడు తోట అరుణ్​​కుమార్​ విమర్శించారు.  రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం విలేకరులతో దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేశ్​తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా పని చేసినవారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, నేరుగంటి బాలరాజ్, వార్డు మెంబర్ ఇమ్రాన్, కొండల్వాడి శంకర్, షేక్ ఖాదర్ పాల్గొన్నారు.