కామారెడ్డిటౌన్, వెలుగు : క్రీడలతో శారీరక దృడత్వం, క్రమ శిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం కప్టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ర్టస్థాయి పోటీలకు అర్హత సాధించి, జిల్లాకు కీర్తి తీసుకురావాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రయార్టీ ఇస్తుందన్నారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఎదగాలన్నారు. ఆర్డీవో వీణ, జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి రంగా వెంకటేశ్వర్‌గౌడ్, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
