టీఆర్ఎస్ కు వంద శాతం సీట్లు బ్రమే: దత్తాత్రేయ

టీఆర్ఎస్ కు వంద శాతం సీట్లు బ్రమే: దత్తాత్రేయ

సికింద్రాబాద్ ఎంపీగా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా సంతృప్తిగా ఉందన్నారు.1984 మొదటి సారి  సికింద్రాబాద్  నుంచి ఎంపీగా పోటీ చేశానని.. ఏ రోజు కూడా తనకు టికెట్ ఇవ్వమని అడగలేదన్నారు. పార్టీ తనను అన్ని విధాలుగా ఆదరించిందన్నారు.  సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా కిషన్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

‘టిఆర్ఎస్ కు వంద శాతం సీట్లు అనేది కేవలం బ్రమే. ఎన్డీఏకు అనేక మంది మద్దతు వస్తోంది. టిఆర్ఎస్, టిడిపిలు ప్రాంతీయ పార్టీలే..సీపీఐ, సీపీఎం, బిజెపి, కాంగ్రెస్ జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను నిలుపుకోలేకపోతున్నారు.ముఖ్య నాయకులకు కూడా కాంగ్రెస్ పై నమ్మకం పోతోంది.  తెలంగాణలో సైతం కాంగ్రెస్ ఓటు షేర్ పడిపోతుంది. హిందుత్వ మీద కేసీఆర్ మాట్లాడే విధానం దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉంది. బిజెపికి ఆదరణ పెరుగుతుందని భయంతో …నేను కూడా హిందువునని చెప్పుకునే ప్రయత్నం  చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం కావాలని కోరిన పార్టీ ఒక్క బిజెపినే. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన  పథకాలే బిజెపిని మళ్ళీ గెలిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న మాట వాస్తవమే..కానీ పార్లమెంట్ లో తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది.నేను పార్టీ మారుతున్న అనే పుకార్లు నిజం కాదు.రాజకీయాల్లో సన్మానాలు, అవమానాలు సహజమే. సునీత లక్ష్మారెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించాము..వస్తారని విశ్వసిస్తున్నాము‘ అని దత్తాత్రేయ అన్నారు.