
పెరిగిన బంధన్ బ్యాంక్ బ్రాంచ్‌లు
హైదరాబాద్, వెలుగు : బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంభించిన 8 సంవత్సరాలలోపే తన శాఖల సంఖ్యను మూడు రెట్లు పెంచుకొని మరో మైలురాయిని సాధించింది. బ్యాంక్‌కు ఇప్పుడు మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలు ఉన్నాయి. మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్‌వర్క్‌తో కూడా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. మొత్తం బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ. 2015 ఆగస్టులో 501 శాఖలతో బంధన్ బ్యాంక్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.