స్విగ్గీలో తగ్గిన విదేశీ వాటా..ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్కంపెనీ

స్విగ్గీలో తగ్గిన విదేశీ వాటా..ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్కంపెనీ

న్యూఢిల్లీ: ఫుడ్​ డెలివరీ, క్విక్​ కామర్స్​కంపెనీ స్విగ్గీలో విదేశీ పెట్టుబడులు 50 శాతం కంటే దిగువకు పడిపోయి 49.76 శాతానికి చేరాయి. వీటిలో విదేశీ పోర్ట్‌‌ఫోలియో పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి. స్విగ్గీ ఇండియన్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ కంపెనీ (ఐఓసీసీ) హోదాను పొందేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఐఓసీసీ అర్హత సాధించడానికి వీలుగా తన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌‌లో మార్పులు చేయడానికి ఈ ఏడాది మేలో  వాటాదారుల ఆమోదానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. విదేశీ వాటా తగ్గడం వల్ల కంపెనీ యాజమాన్యం, నియంత్రణ స్థితిలో ఎలాంటి మార్పూ రాదని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్​లో స్పష్టం చేసింది.