దగా కోరు సీఎంను నమ్మొద్దు..తప్పుడు ప్రచారం చేస్తున్రు

దగా కోరు సీఎంను నమ్మొద్దు..తప్పుడు ప్రచారం చేస్తున్రు

టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను దైవ సాక్షిగా వివరించేందుకే భాగ్యలక్ష్మి టెంపుల్ కు  వచ్చానన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. తన సంతంక ఫోర్జరీ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి  చిల్లర ఆరోపణలు చేయడం బాధించిందన్నారు. తన సవాల్ స్వీకరించి కేసీఆర్ టెంపుల్  కు వస్తారనుకున్నానన్నారు.  తన సంతంకం ఫోర్జరీ చేసిన వారిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ప్రచారం చేసి గెలవాలని చూస్తున్నారన్నారు.

సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు.  టీఆర్ఎస్ పని అయిపోయిందని కేసీఆర్ కు అర్థమైందన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే వరద సాయం అకౌంట్లో వేసేవారన్నారు.  పైసల ఆశచూపి జనాలను క్యూలో నిలబెట్టి చంపారన్నారు. దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్మొద్దన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్ కు జనాలు గుర్తొస్తారన్నారు. తన సవాల్ పై ముఖ్యమంత్రి ఫోన్ లో అయినా స్పందించాలన్నారు. కేసీఆర్ కోసం ఇంకా కూడా వెయిట్ చేస్తానన్నారు.

అంతకు ముందు చెప్పిన టైంకే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ చేరుకున్నారు  .అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  బండికి ఆలయ అధికారులు  స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసారాలు అందజేశారు. వరద సాయం లెటర్ పై చర్చకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలంటూ బండి సంజయ్ నిన్న సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఉదయం నుంచి బండి సంజయ్ ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ బండి సంజయ్ చెప్పిన టైంకు టెంపుల్ కు వచ్చి దర్శనం చేసుకున్నారు.