
హిందువుల ఐక్యతను చాటేందుకే నవరాత్రులని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 20 కిలోల లడ్డూను బండి సంజయ్ గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హిందూ సమాజ సంఘటిత శక్తి చాటేందుకే విగ్నేశ్వరుడి పూజలు చేస్తామన్నారు. హిందువులకు రోజుకో దేవుడు.. వారానికో పండగని అన్నారు. హిందువుగా పుట్టడం తమ పూర్వజన్మ సుకృతం అని అన్నారు. తెలంగాణలో హిందూ సమాజాం జాగృతం కావాలన్నారు.