రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్​ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలను నియమించింది. ఈటల రాజేందర్​ కన్వీనర్​గా ‘చేరికలపై సమన్వయ కమిటీ’ని, జితేందర్​రెడ్డి కన్వీనర్​గా ‘ఫైనాన్స్​ కమిటీ’ని, ధర్మపురి అర్వింద్​ కన్వీనర్​గా ‘ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామికి ‘చేరికలపై సమన్వయ కమిటీ’తోపాటు ‘ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’లో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్​రావును కూడా చేరికలు, ఫైనాన్స్​ కమిటీల్లోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్​గా ఉన్న పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

చేరికలపై సమన్వయ కమిటీ

1.    ఈటల రాజేందర్​ (కన్వీనర్​)
2.    డీకే అరుణ
3.    కె. లక్ష్మణ్​
4.    వివేక్​ వెంకటస్వామి
5.    గరికపాటి మోహన్​రావు
6.    ఎ.చంద్రశేఖర్​
7.    కొండా విశ్వేశ్వర్​రెడ్డి
8.    దుగ్యాల ప్రదీప్​కుమార్​

ఫైనాన్స్​ కమిటీ

1.    జితేందర్​రెడ్డి (కన్వీనర్​)
2.    గరికపాటి మోహన్​రావు
3.    చాడ సురేశ్​రెడ్డి
4.    చింతల రామచంద్రారెడ్డి
5.    శాంతి కుమార్​
6.    యోగానంద్​

ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ

1.    ధర్మపురి అర్వింద్​ (కన్వీనర్​)
2.    వివేక్​ వెంకటస్వామి
3.    రఘునందన్​రావు
4.    స్వామిగౌడ్​
5.    ప్రకాశ్​రెడ్డి
6.    బాబీ అజ్మీరా