ఎన్నికలు వద్దని ఈసీకి లేఖ రాసింది ముఖ్యమంత్రి కాదా?

V6 Velugu Posted on Oct 25, 2021

కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజలు గల్లపట్టి అడగాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆగస్టు 16న దళిత బంధు ప్రారంభించారని.. ఇప్పటి వరకు దళితబంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.  నిజాయితీ ఉంటే దళితబంధు డబ్బులు అకౌంట్లలో ఎందుకు ఫ్రీజ్ చేశారన్నారు. ఎన్నికలు వద్దని ఈసీకి లేఖ రాసింది ముఖ్యమంత్రి కాదా? అని అన్నారు. కేసీఆర్ మొహం చూడటానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని..1400 మంది త్యాగాల వల్ల వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశాడన్నారు. ఈసీపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 3 లక్షల డబుల్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని... రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు.

Tagged Bandi Sanjay, ELECTIONS, KCR, Letter, Chief Minister, ec,

Latest Videos

Subscribe Now

More News