టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న బండి 

టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న బండి 

ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంవల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు విద్యారంగంలో 18వ స్థానంలో తెలంగాణ ఉండటమే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని మండిపడ్డారు. టీచర్లు లేక విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యారని ధ్వజమొత్తారు. గత ఐదేళ్లుగా టెట్ పరీక్షలు నిర్వహించకపోవడంతో యువత నిరాశలో ఉందన్నారు. మైనారిటీ, ఎయిడెడ్ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని..యుద్ధ ప్రాతిపదికన వాటిని భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

నేటి యువతకు ఇవి చాలా అవసరం