
కరీంనగర్: సీఎం కేసీఆర్ తనకు కొమ్ముగాసేవాళ్లకు మాత్రమే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ముఖ్యంగా TNGO నాయకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని.. తనతో ఫోటో దిగినందుకు ఖమ్మంలో ఓ TNGO ఉద్యోగిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పలితాల తరువాత.. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎన్జీఓఎస్ నాయకుడు, అశ్వాపురం ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాస్ రావు బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన సంజయ్.. తన అనుకూలంగా ఉండే వారినే కేసీఆర్ ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నారని.. ధర్నాలో పాల్గొన్న ఓ టీఎన్జీవో నేత బామ్మర్దికి అర్హత లేకున్నా ప్రమోషన్ ఇప్పించాeరన్నారు