ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ దీక్ష

ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ దీక్ష

హైదరాబాద్, నల్గొండ, వెలుగుఏపీ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి, భారీగా నీటిని తరలించుకుపోయే ప్రయత్నంచేస్తున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్  నిరసన దీక్ష చేయనున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ప్రకటించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ప్రభావిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలకు లోబడి ఎవరి ఇండ్లలో వాళ్లు నిరసన దీక్ష చేయాలని సంజయ్ పిలుపుఇచ్చినట్టు తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకే తమ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని సాంబమూర్తి పేర్కొన్నారు. సాగునీటిలో అన్యాయంపై కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అసమర్థ టీఆర్ఎస్ సర్కారుతో పూర్తిస్థాయిలో సాగునీటిని వాడుకోలేక పోతున్నామని తెలిపారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిలో 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తే.. ఇప్పటివరకు కనీసం వంద టీఎంసీలను వినియోగించుకోలేకపోవడం దారుణమన్నారు.

మీడియాకు నో ఎంట్రీ

ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ పార్టీ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో బుధవారం సంజయ్ చేపట్టే దీక్షకు మీడియాను అనుమతించడం లేదని పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు.

పెద్దవూరలో బండి సంజయ్​పై కేసు

బండి సంజయ్, కంకణాల శ్రీధర్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలపై పెద్దవూర పోలీస్ స్టేషన్​లో కేసు ఫైల్​ చేసినట్లు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్​ తెలిపారు. ఈ నెల 7న లా పెద్దవూర పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తాయి తోటలను పరిశీలించి, అక్కడే ప్రెస్​ మీట్​ పెట్టారని, లాక్ డౌన్ రూల్స్​ ఉల్లంఘించినందు వల్ల కేసు నమోదు చేశామన్నారు.

పోతిరెడ్డి పాడు విస్తరణ ప్లాన్​తో ఇరకాటంలో సర్కార్