విశాఖ స్టీల్ ప్లాంట్​ను కొనే డబ్బుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి : బండి సంజయ్

విశాఖ స్టీల్ ప్లాంట్​ను కొనే డబ్బుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి : బండి సంజయ్
  • విశాఖ స్టీల్ ప్లాంట్​ను కొనే డబ్బుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి
  • బీఆర్ఎస్ సర్కార్​కు బండి సంజయ్ డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్​ను కొనే డబ్బుతో తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని బీఆర్ఎస్ సర్కార్​ను బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టాల న్నారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం లేదని ఏపీ పర్యటనలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటించగా.. మంత్రులు కేటీఆర్, హరీశ్ చేసిన కామెంట్లపై సంజయ్ స్పందించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్​లో పాల్గొంటామని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పారని, అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదని క్లారిటీ ఇచ్చారన్నా రు. అందువల్ల ఆ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసే డబ్బులను తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఖర్చు చేయాలన్నా రు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో బీఆర్​ఎస్, వైఎస్సార్ సీపీ సెంటిమెంట్ ను రగిలిస్తున్నాయని ఆరోపించారు.