ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు అభివృద్ధి చెందేలా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా నిర్ణయాలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గ్రామాల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. అనాజీపురంలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా యాదగిరి అనే రైతు వద్దకు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా యాదగిరి పడుతున్న ఇబ్బందులతో పాటు, రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆరుగాలం కష్టించి పని చేసినా.. రెక్కలు ముక్కలవ్వడమే తప్ప, రైతన్నలు బాగుపడే పరిస్థితి లేదని యాదగిరి.. బండి సంజయ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు లాభపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మరోవైపు రైతు యాదగిరి కోరిక మేరకు బండి సంజయ్ ట్రాక్టర్ నడిపారు.