
సీఎం కేసీఆర్ రైతులపై కపటప్రేమ చూపిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
భూసార పరిక్ష లేకుండానే సన్న రకాలు వేయమని కేసీఆర్ చెప్పారని అన్నారు. గ్రామ గ్రామన భూసార పరీక్షలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి రూ.120కోట్ల నిధుల్ని కేటాయించిందని గుర్తు చేసిన బండి సంజయ్…ఆ రూ.120 కోట్లను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. 30 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు వేసారు. వాటి కొనుగోలు సక్రమంగా కొనసాగటం లేదన్నారు.
సన్నారకాలకు రూ.2500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రుణమాఫీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఉద్యమం చేస్తాం. యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ, ఉద్యోగ సమస్యల పై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర వ్యవసాయ బిల్లులపై ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పాలని..కేసీఆర్ కు పలు ప్రశ్నలు సంధించారు. రైతు పండించిన పంట తనకు తానే ధర నిర్ణయించడం తప్పా…? రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛా మార్కెట్ కల్పించటం తప్పా? అని అడిగారు.