తుగ్లక్ నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వాకంతో వేలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పాయారన్నారు. పోలీసు నియామకాల పరీక్షల్లో లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
ఈ విషయంపై తాను లేఖ రాసినా ప్రయోజనం లేదని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల నిర్వహణలో లోపాలు, దేహదారుడ్య పరీక్షల నిబంధనలు సడలించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.