పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన బండి సంజయ్

పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన బండి సంజయ్

రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవాలు జరుపుకుంటుంటే కేసీఆర్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మరుసటి ఏడాది వచ్చిందని అన్నారు. అప్పటి నిజాం వల్ల తెలంగాణ ప్రజలు నానా తిప్పలు పడ్డారని చెప్పారు. తుగ్లక్ ఆలోచనలతో విర్రవీగిన నిజాం.. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతో తోక ముడిచిన విషయాన్ని గుర్తు చేశారు.  సర్వాయి పాపన్న, కొమరం భీమ్ వంటి ఎంతో మంది వీరులు తెలంగాణ కోసం పోరాడారని బండి సంజయ్ అన్నారు. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత 8ఏండ్లుగా బీజేపీ పోరాడుతోందని బండి సంజయ్ చెప్పారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని, దీంతో కేంద్రమే పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎంను కూడా ఆహ్వానించామన్న బండి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.