బీజేపీకి అంబేద్కర్ ఆదర్శం

బీజేపీకి అంబేద్కర్ ఆదర్శం

రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామనేవారికి పుట్టగతులుండవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ లో నివాళులర్పించారు నేతలు. బీజేపీకి అంబేద్కర్ ఆదర్శమన్నారు సంజయ్. అంబేద్కర్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మరోవైపు అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు. 

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ దారిలో నడవాలన్నారు . అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ హామీలు ఇచ్చిండన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన పోవాలన్నారు.దళితుల ఓట్ల కోసం దళిత బందు అని చెప్పిండు... కానీ దళిత బంధువుడు అమలు చేయడం లేదన్నారు.  దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు.