పీవీ నరసింహరావుకు కేసీఆర్ ఎందుకు నివాళి అర్పించలేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ కు నివాళి అర్పించే టైం కూడా లేదా అంటూ మండి పడ్డారు.నెక్లె స్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్, పీవీని విస్మరించాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్ పీవీని వాడుకున్నాడని విమర్శించారు. అసెంబ్లీ దగ్గర పడుతున్నాయి కాబట్టి కేసీఆర్ కు అందరు గుర్తుకొస్తారని అన్నారు.
కేసీఆర్ ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహం,అమరవీరుల స్మారక ప్రారంభించాడని బండి సంజయ్ అన్నారు.. బ్రాహ్మణ సమాజం కేసీఆర్ తీరును గమనించాలన్నారు. కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేసీఆర్ పీవీకి ఒక్క విగ్రహం పెట్టి వదిలేశాడని విమర్శించారు. పీవీ ఘాట్ కూల్చేస్తామని ఓ మూర్ఖుడని..ఓటు బ్యాంకు రాజకీయాల కోసమ ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
