కేటీఆర్ సీఎం అయితే హరీష్ ఔట్ : బండి సంజయ్

కేటీఆర్ సీఎం అయితే హరీష్ ఔట్ : బండి సంజయ్

బీఆర్ఎస్​ మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి కేటీఆర్ సీఎం అయితే హరీష్ ఔట్ అని చెప్పారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ నేతలారా.. బిస్తర్ సర్దుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు. కేసీఆర్.. ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట అని చెప్పారు. ఇండ్లు లేని పేదలందరినీ తెలంగాణ నుండి తరిమేస్తాడేమో అని సెటైర్ వేశారు.  కేసీఆర్.. నిజమైన హిందువైతే అసదుద్దీన్ ఒవైసీకి బొట్టుపెట్టి.. హనుమాన్ చాలీసా చదివించు అని సవాల్ విసిరారు.  ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించిన రోడ్ షో పాల్గొన్న బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. 

ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న మున్నూరు కాపులను మోసం చేశారని ఆరోపించారు. బీసీలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న అక్రమంగా డబ్బు సంపాదించారని ఆరోపించారు. బీసీకి చెందిన జోగు రామన్నను మంత్రి పదవి నుంచి కేసీఆర్ తొలగించారని చెప్పారు. 

తాము 36 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్​వాళ్లు 6 గ్యారంటీలు కాదు.. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారరు అనే గ్యారంటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బుల్డొజర్ ప్రభుత్వం రావాలా..? బాంచన్ దొర అనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వం రావాలో ఆలోచించాలన్నారు.