ప్రగతిభవన్ ఫర్నీచర్ ను చైనా నుంచి ఎందుకు తెప్పించుకున్నరు?

ప్రగతిభవన్ ఫర్నీచర్ ను చైనా నుంచి ఎందుకు తెప్పించుకున్నరు?

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీని ఎదుర్కొనే ముఖం లేకనే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ పై కేసీఆర్  శనివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై సంజయ్ ఒక ప్రకటనలో స్పందించారు. నీతి ఆయోగ్ గొప్పదని గతంలో పొగిడిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం స్థానిక సంస్థలకు నేరుగా నిధులిస్తున్నందుకే ఏడుస్తున్నారని విమర్శించారు.

కేంద్రం నిరుడు రూ. 5 వేల కోట్ల నిధులు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తావా?’’ అని కేసీఆర్ కు సవాల్ విసిరారు.  ‘‘బతుకమ్మ చీరలను కూడా హైదరాబాద్ లో తయారు చేయించడం చేతగాక సూరత్ నుంచి దిగుమతి చేసుకునే మీరు.. ఇతర దేశాల నుంచి దిగుమతుల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ముందు ప్రగతిభవన్ ఫర్నీచర్ ను చైనా నుంచి ఎందుకు తెప్పించుకున్నారో సమాధానం చెప్పాలె” అని సంజయ్ ప్రశ్నించారు.