
ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధీమా
బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం సిరిసినగండ్లకు చెందిన కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్థానిక ఎంపీటీసీ నందాల శ్రీనివాస్ బుధవారం ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కడువా కప్పి పార్టీలోకి సంజయ్ ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నందాల శ్రీనివాస్ బీజేపీలో చేరటం గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కలిసివస్తుందన్నారు. ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల్లో పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీజేపీ గెలుపులో భాగస్వామ్యం కావాలని సూచించారు. నందాల శ్రీనివాస్ మట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరానన్నారు.
For More News..