వచ్చే ఎన్నికల్లో 12 లోక్ సభ స్థానాల్లో బీజేపీదే విజయం

వచ్చే ఎన్నికల్లో  12 లోక్ సభ స్థానాల్లో బీజేపీదే విజయం

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కాగా బీజేపీలో చేరుతారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్  అన్నారు. ముహూర్తం కోసం వేచి చూస్తున్నారన్నారు. కాళేశ్వరంపై బీజేపీ యుద్ధం చేయబోతుందన్నారు. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీకి బృందం వెళ్తుందన్నారు. కేంద్రజలశక్తి మంత్రిని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మునక విషయాన్ని, అవినీతిని వివరిస్తామన్నారు. కాళేశ్వరం మునక నుంచి జనం దృష్టి మళ్లించేందుకే భద్రాచలం ముంపు, పోలవరం ఇష్యూను తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 10, 15 కు మించి అసెంబ్లీ సీట్లు రావని బండి సంజయ్  అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుందన్నారు.హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందన్నారు. మునుగోడుకు ఉపఎన్నిక రావాలని టీఆర్ఎస్ .. రావొద్దని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. 

బీజేపీలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం చూసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసే విషయాన్ని తెలియక ప్రస్తావించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యాన్ని ఉచితం చేస్తామన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు .

ఢిల్లీలో కేసీఆర్..తరుణ్ చుగ్ ను కలిసిన వార్తలను బండి సంజయ్ ఖండించారు.. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారంచేస్తుందన్నారు..రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుల బాధ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంటుందన్నారు. రాజకీయాల్లో కేసీఆర్ ఔడేటెడ్ అయిపోయిన నేత అన్నారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజకీయ భవిష్యత్ కోసం బయటకురావాలని చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. చేనేత బీమా అమలు కోసం ఆగస్టు 7న బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఉద్యమాన్ని పోచంపల్లి నుంచి ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతామన్నారు .వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు బీజేపీకే మద్దతిస్తారని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ వేధింపులను సెటిలర్లు తట్టుకోలేకపోతున్నారన్నారు .