కవిత సీఎం ఇంటి ముందు ధర్నా చేయాలె: బండి సంజయ్

కవిత సీఎం ఇంటి ముందు ధర్నా చేయాలె: బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 2023,మార్చి 10వ తేదీ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు.  సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేబినెట్ మీటింగ్ లో మహళలపై ఎందుకుమాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు. మద్యం రేట్లు పెంచిందే కవిత కోసమని వ్యాఖ్యానించారు బండి సంజయ్.  40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్రనికి వస్తోందని చెప్పారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ 2 గా ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. మోడీ సర్కార్ లో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని ఆరోపించారు.