కవితకు నోటిసులిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్: బండి సంజయ్

కవితకు  నోటిసులిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్: బండి సంజయ్

లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తాము ఎలాంటి చర్చ జరుపలేదన్నారు. మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తే కేసీఆర్ స్పందించాడు కాని.. కవితకు సీబీఐ నోటీసులిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ నిలదీశారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఛార్జీషీటులో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. అవినీతి పనులు చేస్తే చట్టానికి ఎవరూ అతీతం కాదన్నారు. 

ప్రజా సమస్యలపై బీజేపీ ఆందోళన చేపట్టనుందని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ బీజేప పోటీ చేస్తుందన్నారు.  ఈ మేరకు 119 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నామని అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అంటూ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా స్పందించేది బీజేపీ పార్టీనే అని బండి సంజయ్ పేర్కొన్నారు.